మన పత్రిక, హైదరాబాద్: నగరంలో శుక్రవారం మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని అన్ని మద్యం దుకాణాలు, బార్లు, కళ్లుదుకాణాలు అలాగే స్టార్ హోటళ్లలోని బార్లలో కూడా మద్యం విక్రయాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ కమిషనర్ సజ్జనార్ అధికారిక ఉత్తర్వులు జారీచేస్తూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.
శ్రీరామ నవమి వేడుకలు నగరంలో ఘనంగా జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తే అవకాశాలు ఉన్నందున డ్రై డే ప్రకటించినట్లు చెప్పారు. ఆదేశాలను అతిక్రమించి ఎవరైనా మద్యం విక్రయాలు నిర్వహిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు పోలీసుల నిర్ణయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
