మన పత్రిక తెలంగాణ: రాష్ట్రంలో వంటగ్యాస్ కొరత సామాన్యులను బెంబేలెత్తిస్తోంది. రోజులు గడుస్తున్నా బుక్ చేసిన సిలిండర్లు ఇంటికి రాకపోవడంతో వినియోగదారుల సహనం నశించి గ్యాస్ ఏజెన్సీలపై దాడులకు దిగుతున్నారు. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్‌పేట్ కూడలి వద్ద గురువారం ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ గ్యాస్ ఏజెన్సీ నుంచి సిలిండర్ల లోడ్‌తో బయటకు వస్తున్న ఆటోను చూసిన కొందరు స్థానికులు ఒక్కసారిగా దానిపైకి దూసుకెళ్లారు.
అనుమతి లేకుండా ఆటోలోని సిలిండర్లను బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. “ఎన్ని రోజులు వేచి చూడాలి? బుక్ చేసి వారాలవుతున్నా గ్యాస్ రావడం లేదు” అంటూ వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో ఏజెన్సీ సిబ్బంది, ఇతర స్థానికులు కలిసి వారిని అడ్డుకున్నారు. నిబంధనల ప్రకారం పంపిణీ జరుగుతుందని నచ్చజెప్పి, బలవంతంగా తీసుకున్న సిలిండర్లను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. నగరంలో నెలకొన్న ఈ కృత్రిమ కొరతపై ప్రభుత్వం వెంటనే స్పందించి సరఫరాను క్రమబద్ధీకరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
