మన పత్రిక, కాలిఫోర్నియా: ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం ‘మెటా’ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. సంస్థను మరింత క్రమబద్ధీకరించే క్రమంలో భాగంగా వివిధ విభాగాలకు చెందిన సుమారు 700 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫండమెంటల్ ఏఐ రీసెర్చ్ (FAIR)తో పాటు ఇతర ఏఐ అనుబంధ టీమ్స్‌పై ఈ ప్రభావం పడింది. ఒకే తరహా పనులు చేసే బహుళ బృందాల వల్ల నిర్ణయాల్లో జాప్యం జరుగుతోందని, అందుకే విభాగాల మధ్య సమన్వయం పెంచి కార్యకలాపాలను వేగవంతం చేయడమే ఈ తొలగింపుల ప్రధాన ఉద్దేశమని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.
ఉద్యోగ కోతకు గురైన వారికి సంస్థ ఉదారంగానే పరిహారం ప్రకటించింది. బాధితులకు 16 వారాల ప్రాథమిక వేతనంతో పాటు, వారు పనిచేసిన ప్రతి ఏడాదికి అదనంగా రెండు వారాల వేతనాన్ని పరిహారంగా అందించనుంది. భవిష్యత్తులో ఏఐ రంగంలో అగ్రగామిగా నిలిచేందుకు అవసరమైన వ్యూహాత్మక మార్పుల్లో భాగంగానే ఈ ప్రక్షాళన చేపట్టినట్లు తెలుస్తోంది. గత ఏడాదిలోనూ మెటా వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన విషయం విదితమే.
ఇవి కూడా చదవండి :
- హైదరాబాద్‌లో పడిపోయిన రియల్ ఎస్టేట్: కొనుగోలుదారులు లేక ఖాళీగా ఫ్లాట్లు
- Petrol Diesel price hike : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: దిల్లీలో రూ. 100 దాటిన రేటు
- నేటితో ముగియనున్న టీజీ దోస్త్ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల గడువు
- తెలంగాణలో తొలి గాజు వంతెన.. హుస్నాబాద్‌లో ముమ్మరంగా పనులు
- బండ్లగూడలో తప్పిపోయిన నాలుగేళ్ల చిన్నారి గుర్తింపు..
