Telangana Rains : ఇప్పుడిప్పుడే పంటలు కోసి ధాన్యం చేతికొస్తుంది అని రైతులు కాస్త ఉపశమనం పొందుతున్నారు. ఇంతలోనే వర్షాలు వాళ్ల ఆశల మీద నీళ్లు పోస్తున్నాయి. ఇప్పటికే గత రెండు మూడు రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల వల్ల మార్కెట్లలో ఎండబెట్టిన ధాన్యం కాస్త తడిసి ముద్దయింది. ఇంకా కోయని వరి కూడా తడిసి పోయి వానకు నేలకొరిగింది.
Advertisement
నైరుతి రుతుపవనాలు బైబై చెప్పినప్పటికీ, ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దీంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరింది.
Advertisement
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement

