Advertisement

యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా వెసులుబాటు త్వరలో?

వేత న ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ డబ్బును మరింత వేగంగా, సులభంగా ఉపసంహరించుకునేలా ఈపీఎఫ్ఓ కొత్త సదుపాయాన్ని తీసుకువచ్చే ఆలోచనలో ఉంది. యూపీఐ ద్వారా, ముఖ్యంగా భీమ్ యాప్ ఉపయోగించి తమ ఖాతాలోని అర్హత కలిగిన పీఎఫ్ నిధులను పొందేందుకు వీలుగా ఈ ప్రక్రియను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

ఈ సదుపాయాన్ని వినియోగించుకోవడానికి ఉద్యోగులు తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యుఎఎన్) ను యూపీఐ ఖాతాతో అనుసంధానించాల్సి ఉంటుంది. పీఎఫ్ ఉపసంహరణలకు సంబంధించిన సాంకేతిక పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే, దీని ప్రారంభ తేదీపై ఈపీఎఫ్ఓ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

Advertisement

నిబంధనలు మరియు నిధుల పరిమితి

ప్రస్తుత నిబంధనల ప్రకారం అర్హులైన ఉద్యోగులు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌లో 75 శాతం వరకు ఉపసంహరించుకునే అవకాశం ఉండగా, మిగిలిన 25 శాతం రిటైర్మెంట్ పొదుపుగా ఉంచాల్సి ఉంటుంది. అయితే ఈ కనీస నిల్వ పరిమితిని 10 శాతానికి తగ్గించే ప్రతిపాదనకు ఇటీవల ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆమోదం తెలిపింది. ఈ మార్పు పూర్తిగా అమల్లోకి వస్తే అర్హులైన ఉద్యోగులు తమ నిల్వలో 90 శాతం వరకు పొందే వీలుంటుంది.

అలాగే పాక్షిక ఉపసంహరణల కోసం గతంలో ఉన్న 13 విభాగాలను మూడు ప్రధాన రకాలుగా కుదించారు. విద్య కోసం గరిష్టంగా 10 సార్లు, వివాహ అవసరాల కోసం 5 సార్లు వరకు నిధులను విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. పాక్షిక ఉపసంహరణలకు కనీస సేవా కాలాన్ని 12 నెలలకు తగ్గించడంతో పాటు ఆటో-సెటిల్‌మెంట్ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచారు.

Advertisement