Advertisement

కార్తీక్ ఆర్యన్‌కు శ్రీలీల ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు

బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ తన 36వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా నటి శ్రీలీల ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. కార్తీక్ ఆర్యన్‌తో కలిసి ఉన్న ఒక ఫోటోను పంచుకున్న ఆమె, ఆయనను డోస్ ఆఫ్ డోపమైన్ అని సంబోధిస్తూ షూటింగ్ నుంచి కొద్దిగా విరామం తీసుకోమంటూ సరదాగా సందేశం రాసుకొచ్చారు.

అనురాగ్ బసు సినిమా ప్రాజెక్ట్

దర్శకుడు అనురాగ్ బసు తెరకెక్కిస్తున్న ఒక రొమాంటిక్ మ్యూజికల్ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, శ్రీలీల మొదటిసారి కలిసి నటిస్తున్నారు. భూషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను 2027 ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement
Advertisement