దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ జీవితంలో నటి ఈషా రేబ్బ కేవలం ఒక స్నేహితురాలు మాత్రమే కాదని, ఆయనకు సోల్‌మేట్ అని ఆయన తల్లి గీతా భాస్కర్ తెలిపారు. ఈ నగరానికి ఏమైంది 2 చిత్ర ప్రీ-రిలీజ్ వేడుకలో మాట్లాడిన ఆమె, తరుణ్ కష్టసమయాల్లో ఈషా ఎంతో అండగా నిలిచిందని పేర్కొన్నారు.
గడిచిన రెండేళ్లలో కోర్టు కేసులు, ఇల్లు నిర్మాణానికి సంబంధించిన సమస్యల వల్ల తరుణ్ భాస్కర్ అనేక సవాళ్లను ఎదుర్కొన్నారని గీతా భాస్కర్ గుర్తు చేసుకున్నారు. కొన్ని రోజులు ఆయన ఆలస్యంగా ఇంటికి వచ్చినా ఈషా ఆయనను చూసుకుంటూ మద్దతుగా నిలిచిందని చెప్పారు. అలాగే ఈ నగరానికి ఏమైంది 2 సినిమా పూర్తి కావడంలో కూడా ఈషా సహాయం చేసిందని ఆమె తెలిపారు. కాగా ఈ చిత్రం 2026 నవంబర్ 20న థియేటర్లలో విడుదల కానుంది.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
