Advertisement

79 ఏళ్లుగా చెక్క వినాయకుడితోనే పూజలు

MH: వినాయక చవితి వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా ప్లాస్టర్ ఆఫ్ పారిస్, మట్టి వినాయకులను ప్రతిష్టిస్తుంటారు. కానీ ఓ గ్రామంలో మాత్రం గత 79 ఏండ్లుగా ఒకే చెక్క వినాయకుడిని ప్రతిష్టిస్తూ భక్తిశ్రద్ధలు చాటుకుంటున్నారు. ఆదివారం ఉదయం వేద మంత్రోచ్ఛరణలు, హోమాల మధ్య ఈ కర్ర వినాయకుడిని గ్రామస్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రతిష్టించారు.

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బోకర్ తాలూకా పాలజ్ గ్రామంలో ఈ ‘సత్య గణేశుడు’ కొలువుదీరాడు. 1948లో అంటు రోగాలు, తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్న సమయంలో ఈ విగ్రహాన్ని తయారు చేయించారు. అప్పటి నుంచి గ్రామంలో పరిస్థితులు మెరుగుపడటం, పంటలు పుష్కలంగా పండటంతో ఈ దైవంపై భక్తులకు నమ్మకం మరింత పెరిగింది. ఈ విగ్రహం మరో ప్రత్యేకత ఏంటంటే.. 11 రోజుల పూజల తర్వాత నిమజ్జనం చేయకుండా, శోభాయాత్ర నిర్వహించి వాగు నీళ్లు చల్లి బీరువాలో భద్రపరచడం ఇక్కడ అనవాయితీగా వస్తోంది. ఏటేటా భక్తుల తాకిడి పెరగడంతో పాటు నిత్య అన్నదానం, తాగునీరు, బస వంటి మెరుగైన వసతులు కల్పిస్తున్నారు.

Advertisement
Advertisement