Advertisement

తూ. గో: పండగ పూట విషాదం.. చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి

తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలంలో వినాయక చవితి పర్వదినాన తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పండుగ వేడుకల కోసం భక్తిశ్రద్ధలతో పూలు కోసేందుకు చెరువులోకి దిగిన ఇద్దరు యువకులు నీటమునిగి దుర్మరణం పాలయ్యారు. సంతోషంగా సాగాల్సిన పండుగ పూట ఈ ఘోరం జరగడంతో ఆ ప్రాంతమంతా శోకసముద్రంలో మునిగిపోయింది.

కోరుకొండ కొత్త చెరువులోకి పూలు కోసేందుకు వీరబాబు (35), శివ (35) దిగారు. అయితే లోపల ఊబి ఉన్న విషయాన్ని గమనించకపోవడంతో వారు ప్రమాదవశాత్తు అందులో కూరుకుపోయారు. బయటకు రాలేక, ఊపిరి ఆడక నీటిలోనే ప్రాణాలు వదిలారు. ఈ ప్రమాద వార్త తెలియగానే పశ్చిమ గోనగూడెం గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకే వయస్సు కలిగిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో నిశ్శబ్దం నెలకొంది. చెరువు నుంచి బయటకు తీసిన మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది.

Advertisement
Advertisement