Advertisement

గణేష్ భక్తులకు TGSRTC గుడ్ న్యూస్

TG: వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ గణేష్ మండపాలను దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ ఆర్టీసీ భారీగా ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రకటించింది. ఈ ప్రత్యేక బస్సులు సెప్టెంబర్ 14 నుంచి 24 వరకు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి వెల్లడించారు. నగరంలోని జేబీఎస్, ఎంజీబీఎస్ మీదుగా ఈ సేవలు సాగనున్నాయి.

జేబీఎస్ నుంచి ప్రారంభమయ్యే ఈ బస్సులు ప్యాట్నీ, ట్యాంక్ బండ్, ఖైరతాబాద్, అఫ్జల్‌గంజ్, ఎంజీబీఎస్ మీదుగా బాలాపూర్ గణేష్ మండపానికి చేరుకుంటాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా జేబీఎస్ వద్ద ఉదయం 6:00 గంటలకు మొదటి సర్వీస్ ప్రారంభమై రాత్రి 9:55 గంటల వరకు ప్రతి 40-50 నిమిషాల వ్యవధిలో బస్సులు నడుస్తాయని తెలిపారు. బాలాపూర్ నుంచి తిరుగు ప్రయాణ బస్సులు ఉదయం 7:55 నుంచి రాత్రి 11:50 వరకు అందుబాటులో ఉంటాయని, భక్తులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement
Advertisement