Advertisement

బిగ్‌బాస్-10.. డేంజర్‌ జోన్‌లో 11మంది కంటెస్టెంట్స్..?

‘దశావతారం’ కాన్సెప్ట్‌తో ప్రారంభమైన బిగ్‌బాస్ సీజన్ 10 మొదటి వారం నుంచే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆట ప్రారంభమైన వారం తిరగకముందే ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారనే ప్రచారం అందరికీ షాకిచ్చింది. తాజాగా శనివారం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఎప్పటిలాగే స్టైలిష్ లుక్‌లో వచ్చిన హోస్ట్ నాగార్జున హౌస్‌మేట్స్‌తో ముచ్చటించి అసలు ట్విస్ట్‌లు బయటపెట్టారు.

ఎలిమినేట్ అయ్యారన్న చైత్ర, చరణ్ నిజానికి షో నుంచి వెళ్ళిపోలేదని, సీక్రెట్ రూమ్‌లో ఉన్నారంటూ హౌస్‌మేట్స్ అనుమానించగా.. నాగార్జున స్వయంగా వారిని లైవ్‌లోకి తీసుకువచ్చి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో మిగతా కంటెస్టెంట్లు ఆశ్చర్యపోయారు. ఇక ఈ వారం జరిగిన టాస్క్‌ల ఆధారంగా ముగ్గురు మాత్రమే సేఫ్ కాగా.. మిగతా 11 మంది కంటెస్టెంట్లు ప్రస్తుతం డేంజర్ జోన్‌లో ఉన్నట్లు నాగార్జున హెచ్చరించారు. దీంతో హౌస్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎలిమినేషన్ గండం ఎవరిపై పడుతుందనే ఉత్కంఠ ప్రేక్షకుల్లోనూ పెరిగింది.

Advertisement
Advertisement