Advertisement

జొమాటో కస్టమర్లకు మరో షాక్!

హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసే కస్టమర్లకు ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే వివిధ రకాల ఛార్జీలతో జేబులు గుల్ల చేస్తున్న ఆ సంస్థ.. తాజాగా ‘క్యాష్ ఆన్ డెలివరీ’ ఎంచుకునే కస్టమర్లపై అదనంగా రూ.5 నుంచి రూ.20 వరకు వసూలు చేయడం మొదలుపెట్టింది. బిల్లు సమ్మరీలో ఈ ‘పే ఆన్ డెలివరీ ఫీజు’ ప్రత్యేకంగా కనిపిస్తుండటం గమనార్హం. డిజిటల్ పేమెంట్స్ చేసే వారికి ఈ భారం ఉండదు కానీ, నగదు ఇస్తామనే వారికి మాత్రం ఈ రుసుము తప్పడం లేదు.

మార్కెట్లో కొత్త ప్రత్యర్థుల నుంచి పోటీ ఎదురవుతున్న వేళ.. జొమాటో ఇలా చిన్న ఛార్జీల ద్వారా అదనపు ఆదాయం రాబట్టే ప్లాన్‌కు తెరలేపింది. రోజువారీగా లక్షలాది ఆర్డర్లను ప్రాసెస్ చేసే జొమాటోకు ఈ సీవోడీ ఛార్జీల రూపంలో రోజువారీగా కోట్లలో ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఇప్పటికే ప్లాట్‌ఫాం ఫీజును రూ.15 వరకు పెంచిన ఆ సంస్థ, ఇప్పుడు పేమెంట్ పద్ధతిని బట్టి వసూలు చేస్తుండటంతో ఫుడ్ ప్రియులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థి సంస్థ స్విగ్గీ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి సీవోడీ ఫీజును ప్రవేశపెట్టలేదు. చివరకు క్యాష్ ఇచ్చినందుకు కూడా బాదుతుండటంతో కస్టమర్లు మండిపడుతున్నారు.

Advertisement
Advertisement