Advertisement

‘ది ప్యారడైజ్’ జనం సినిమా: హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్‌ ఓదెల

హైదరాబాద్‌: “నా 18 ఏళ్ల నట జీవితంలో మానసికంగా, శారీరకంగా ఎక్కువగా కష్టపడింది ‘ది ప్యారడైజ్‌’ కోసమే. ఇందులో హింస కనిపించినా, దాని వెనకున్న భావోద్వేగాలను ప్రేక్షకులు అనుభూతి చెందుతారు” అని హీరో నాని అన్నారు. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో, కయాదు లోహర్‌ కథానాయికగా, మోహన్‌బాబు ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో చిత్రబృందం మాట్లాడింది.

నాని మాట్లాడుతూ.. “కెరీర్‌లో ఇంత సుదీర్ఘ విరామం ఎప్పుడూ రాలేదు. ప్రణాళికల్లో లోపాలు ఉన్నా అనుకున్న నాణ్యతతో సినిమాని సిద్ధం చేశాం. నాణ్యత పైనే దృష్టి పెట్టడం వల్ల ట్రైలర్‌ను విడుదల చేయడం లేదు. ప్రత్యేకమైన వేషధారణ, జడలతో ఉన్న పోరాట ఘట్టాల్లో నటించడమే నాకొక పెద్ద సవాల్. కథల విషయంలో నేను ట్రెండ్‌ను అనుసరించలేదు, త్వరలోనే మరింత భిన్నమైన చిత్రంతో వస్తా” అని వెల్లడించారు. దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల మాట్లాడుతూ.. “ఇది ఒక సవారీ జాతి తిరుగుబాటు కథ. భావోద్వేగాలే ఇందులో ప్రధానం” అన్నారు. నిర్మాత సుధాకర్‌ చెరుకూరి మాట్లాడుతూ.. అంచనాలు మించినా నిర్మాణ వ్యయం పట్ల సంతృప్తిగా ఉన్నానని, ముందస్తు ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు

Advertisement
Advertisement