Advertisement

ఈశ్వర్ సాయికి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్

హైదరాబాద్: మాధురి రాథోడ్‌ నమోదు చేసిన బిఎన్‌ఎస్, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో ఈశ్వర్ సాయికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టులో ఈశ్వర్ సాయి తరఫున అడ్వొకేట్ నాగూర్ బాబు తమ వాదనలను వినిపించారు. పెళ్లయిన వ్యక్తితో ఫిర్యాదుదారు సంవత్సరాలుగా సంబంధం కొనసాగించిన విషయాన్ని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కేవలం మీడియా సింపతీ కోసమే తీవ్రమైన ఆరోపణలు చేస్తూ తప్పుడు కేసులు పెట్టారని న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం ఈశ్వర్ సాయికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.

Advertisement