Advertisement

సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి.. పట్టు చీరపై వాసవీ అమ్మవారు

సిరిసిల్లకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్‌ పట్టు దారాలపై మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు. పట్టు, రెండు గ్రాముల బంగారు జరీని ఉపయోగించి ఏడు మీటర్ల చీరపై వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ప్రతిరూపాన్ని ఎంతో మనోహరంగా కొలువుదీర్చారు. ఈ చీరపై అమ్మవారి చిత్రంతో పాటు 102 మంది రుషుల పేర్లు, గోత్రనామాలు, 25 చారిత్రక చిత్రాలు స్పష్టంగా కనిపించేలా నేయడం విశేషం. ఈ అద్భుత రూపాన్ని తీసుకురావడానికి తనకు 45 రోజుల సమయం పట్టిందని హరిప్రసాద్‌ వెల్లడించారు. గుంటూరుకు చెందిన రత్నకుమారి, కోటేశ్వరరావు దంపతులు ఈ చీరను ప్రత్యేకంగా తయారు చేయించారని, దీనిని అక్కడి కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి సమర్పించనున్నట్లు వారు తెలిపారని ఆయన పేర్కొన్నారు.

Advertisement