Advertisement

సుద్దాలకు ‘తెలంగాణ తెలుగు తేజం’ పురస్కారం

కరీంనగర్: ప్రముఖ కవి, జాతీయ సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజకు 2026 సంవత్సరానికి గాను రాష్ట్ర స్థాయి బుర్ర నర్సమ్మ-లింగారెడ్డి స్మారక ‘తెలంగాణ తెలుగు తేజం’ సాహిత్య పురస్కారం లభించింది. తెలుగు భాషా సంరక్షణ సంఘం-తెలంగాణ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ఏటా ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. పురస్కార కమిటీ ఛైర్మన్, అవార్డు వ్యవస్థాపకుడు కెప్టెన్‌ డా.బుర్ర మధుసూదన్‌రెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాస్యం సేనాధిపతి శుక్రవారం ఒక ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించారు. ఈ నెల 22న కరీంనగర్‌ పట్టణంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. తెలుగు భాషా వికాసానికి తెలంగాణ మట్టి బిడ్డలు అందిస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

Advertisement