Advertisement

సీఎం రేవంత్ రెడ్డితో ఉద్యోగ సంఘాల జేఏసీ భేటీ

TG: ప్రభుత్వం ఇచ్చిన ఆహ్వానం మేరకు ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డిని జేఏసీ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిడి, సంఘాల నాయకులపై ఉన్న ఒత్తిడి వంటి అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేకంగా ఆరు డీఏలు పెండింగ్‌లో ఉండటం వల్ల కలుగుతున్న నష్టం, పీఆర్సీ కమిటీ నివేదిక ఆలస్యంపై నెలకొన్న ఆవేదనను వివరించారు.

ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన సీఎం.. తాను ఎల్లప్పుడూ ఉద్యోగుల పక్షాన ఉంటానని, ఒక్కొక్క సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు కే గౌతమ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రమణ్ రెడ్డి తెలిపారు. ఆరు డీఏలపై త్వరలోనే ప్రకటన చేస్తామని, పీఆర్సీ నివేదిక వెంటనే అందేలా చర్యలు తీసుకుంటానని సీఎం స్పష్టం చేసినట్లు చెప్పారు. సీఎం సానుకూలంగా స్పందించడం పట్ల ట్రెసా నాయకత్వం హర్షం వ్యక్తం చేసింది. ఈ భేటీలో ట్రెసా గౌరవాధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

Advertisement
Advertisement