Advertisement

మహిళా పోలీసుల సమర్థత అభినందనీయం: స్పీకర్ గడ్డం

TG: అసెంబ్లీ బందోబస్తు విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుళ్లతో శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ నెల 7న అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఆందోళన సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణలో మహిళా పోలీసులు ఎదుర్కొన్న ఇబ్బందులపై ఆయన ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే సమయంలో తలెత్తిన పరిస్థితులను అడిగి తెలుసుకుంటూ వారి సమస్యలను సానుకూలంగా విన్నారు.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మహిళా ఉద్యోగులు తమ విధులను అత్యంత సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా నిర్వహించారని స్పీకర్ ప్రసాద్ కుమార్ కొనియాడారు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సంయమనం పాటిస్తూ శాంతిభద్రతలను కాపాడడంలో మహిళా సిబ్బంది చూపిన ప్రతిభ అభినందనీయమన్నారు. ప్రజాస్వామ్యయుత నిరసనల వేళ పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాల్సిన తీరును గుర్తుచేశారు. విధుల్లో భాగంగా ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకావద్దని, సిబ్బంది ఎప్పుడూ మనోధైర్యం కోల్పోవద్దని వారికి భరోసానిచ్చారు.

Advertisement
Advertisement