మన పత్రిక, హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో ఆగస్టు 29 శనివారం ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 30 ఆదివారం ఉదయం 10 గంటల వరకు 24 గంటల పాటు తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. బండ్లగూడ ఎక్స్ రోడ్డు వద్ద పైప్‌లైన్ జంక్షన్ పనులు చేపట్టాల్సి ఉన్నందున ఈ తాగునీటి బంద్ విధిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) తెలిపింది.
ఈ పనుల కారణంగా శాస్త్రిపురం, బండ్లగూడ, శంషాబాద్, మధుబన్, దుర్గానగర్, సులేమాన్ నగర్, పీడీపీ, గోల్డెన్ హైట్స్, అత్తాపూర్, కిస్మత్‌పూర్, 9 నంబర్, అల్లాబండ, భోజగుట్ట, గంధంగూడ, ప్రసన్న నగర్, జూబ్లీహిల్స్, తట్టిఖానా, గచ్చిబౌలి, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాకు ఆటంకం కలుగనుంది. ఆయా ప్రాంతాల ప్రజలు అవసరమైన నీటిని ముందుగానే నిల్వ చేసుకోవాలని, సరఫరా పునరుద్ధరించే వరకు నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని అధికారులు సూచించారు. మరమ్మతు పనులు పూర్తయిన తర్వాత ఆగస్టు 30 ఆదివారం ఉదయం 10 గంటలకు సాధారణ నీటి సరఫరా పునరుద్ధరణ అయ్యే అవకాశం ఉంది.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
