Advertisement

నాని ‘ది పారడైజ్’ నుంచి ఫోక్ సాంగ్

మన పత్రిక: న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ది పారడైజ్’ సినిమా నుంచి రెండో పాటను విడుదల చేసేందుకు చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోంది. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ డాలస్‌లో నిర్వహించే సంగీత విభావరిలో ఈ పాటను లాంచ్ చేయనుండగా, డిజిటల్ వేదికలపై ఆగస్టు 29న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.

ప్రసిద్ధి చెందిన తెలంగాణ జానపద గీతం “యేషా నాగుల కట్ట మీద” కు ఇది రీమిక్స్ రూపమని చిత్రబృందం వెల్లడించింది. ఈ ప్రత్యేక పాటలో నానితో కలిసి కీర్తి సురేష్ నటించారు. వీరిద్దరి కలయికలో గతంలో ‘నేను లోకల్’, ‘దసరా’ వంటి చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, జంగి రెడ్డి మరియు ప్రభాస్ ఆలపించారు. అనిరుధ్ రవిచందర్ బాణీలు సమకూర్చారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

Advertisement