Advertisement

పుల్లెంల గ్రామంలో విద్యుత్ షాక్‌తో బోరు బావి మెకానిక్ మృతి

మన పత్రిక, చండూరు: విద్యుత్ షాక్ (Electric Shock) తగలడంతో బోరు బావి మోటార్ తీసే మెకానిక్ మృతి చెందిన సంఘటన చండూరు మండల పరిధిలోని పుల్లెంల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం, చండూరు మున్సిపాలిటీ 3వ వార్డు లకినేనిగూడెంకు చెందిన షేక్ సయ్యద్ (38) బోరుబావుల మోటర్లను తీసే మెకానిక్‌గా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం పుల్లెంల గ్రామానికి చెందిన బద్దుల స్వామికి చెందిన బోరు మోటర్ రిపేరు కోసం తీసుకెళ్లిన సమయంలో ఆయన ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యారు.

Advertisement

ప్రమాదం జరిగిన వెంటనే ఆయనను 108 అంబులెన్స్ ద్వారా నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆయన అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. ఈ ఘటనతో లకినేనిగూడెం, పుల్లెంల గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement