మన పత్రిక, ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో పిట్ల వంశీ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. బుధవారం రాత్రి తన ఇంట్లోనే అతను ఉరి వేసుకుని మృతి చెందాడు.
ఈ ఘటనకు సంబంధించి మృతుడు వదిలి వెళ్ళిన సూసైడ్ నోట్ సంచలనంగా మారింది. తన చావుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కారణమని ఆ లేఖలో అతను పేర్కొన్నట్లు స్థానికులు తెలిపారు. తన కుటుంబ సభ్యులను ఎవరూ ఇబ్బంది పెట్టవద్దని, అంత్యక్రియలను ఆనవాయితీ ప్రకారం జరపాలని కూడా ఆ లేఖలో కోరాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
ఇవి కూడా చదవండి :
- రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి: కేటీఆర్ హెచ్చరిక
- హనీమూన్ హత్య కేసులో నిందితురాలు సోనమ్ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు
- విజయ్ నటన నుంచి నిష్క్రమణలో వచ్చిన జనా నాయకుడు చిత్రం విశేషాలు
- ఢిల్లీలో మెట్రో స్టేషన్ల మూసివేతపై సుప్రీంకోర్టు స్పందన
- రూ. 4.25 లక్షలకు కొన్న బంగళా ఇప్పుడు రూ. 450 కోట్ల ఆస్తిగా మారిన వైనం
