Advertisement

శ్రీశైలం ఘాట్ రోడ్డుపై ఘోర ప్రమాదం: ఒకరు మృతి

మన పత్రిక, అచ్చంపేట: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం సిద్ధాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీశైలం ఘాట్ రోడ్డు సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.

కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో వాహనం అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కేసుమోల్ల లక్ష్మి (38) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ పెరుముల నాగరాజును మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. లక్ష్మి హైదరాబాద్‌లో కూలీ పని చేసి, తన స్వగ్రామమైన తుర్కపల్లికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై సిద్ధాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement