Advertisement

శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

మన పత్రిక, శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయానికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు రావడంతో కలకలం రేగింది. టేకాఫ్ అయిన విమానంలో బాంబు ఉందంటూ గురువారం ఉదయం ఈమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. దీంతో ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.

వెంటనే సీఐఎస్ఎఫ్ అధికారులు మరియు బాంబ్ స్క్వాడ్ బృందాలు విమానాశ్రయ ప్రాంగణంలో విస్తృత తనిఖీలు చేపట్టాయి. అయితే ఎయిర్‌పోర్టులో ఎలాంటి అనుమానిత వస్తువులు లభ్యం కాలేదు. బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడంతో అప్పటికే టేకాఫ్ అయిన విమానాల సిబ్బందికి కూడా అధికారులు సమాచారం అందించారు. ఇలాంటి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదని, గతంలో కూడా ఆకతాయిలు ఇలాగే వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement