మన పత్రిక, నకరికల్లు: పల్నాడు జిల్లా నకరికల్లు మండలం కుంకలగుంట గ్రామంలో జరిగిన ప్రమాదంలో ఆవుల నాగార్జున అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. గ్రామంలోని నల్లచెరువు వద్ద నాగార్జున తన ట్రాక్టర్‌ను పక్కన ఆపి విశ్రాంతి తీసుకుంటుండగా, అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్ లారీ ఒకటి అతనిపై నుంచి వెళ్లడంతో అతను అక్కడికక్కడే మరణించాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలపై తాము పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
