Advertisement

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు

మన పత్రిక: శ్రీకాకుళం జిల్లా పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆయన ఇంటిని పోలీసులు భారీగా చుట్టుముట్టారు. సీదిరి అప్పలరాజు కుమారుడు చేసిన హిట్ అండ్ రన్ ఘటనకు సంబంధించి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ఏ3గా చేర్చారు. తన కుమారుడిని ఈ కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించినట్లు ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో సోంపేట కోర్టులో అప్పలరాజు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. అలాగే ఆయన కుమారుడి కోసం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు మాజీ మంత్రి నివాసం వద్ద భారీగా బలగాలను మోహరించారు. ఈ కేసులో మాజీ మంత్రికి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Advertisement
Advertisement