మన పత్రిక, సంగారెడ్డి: అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, కంది లక్ష్మీ నగర్ కాలనీలో నివాసముంటున్న మొహమ్మద్ మహబూబ్ (26) స్థానికంగా పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. ఇతడికి భార్య, ఏడాదిన్నర వయస్సున్న కూతురు ఉన్నారు.
మహబూబ్ గత కొంతకాలంగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ నెల 21వ తేదీ రాత్రి అతను ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కంది వైన్స్ వెనుక ఉన్న పొలాల్లో ఒక వ్యక్తి మరణించి ఉన్నాడని పోలీసులకు సమాచారం అందడంతో, వారు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహం మహబూబ్‌దిగా గుర్తించారు. ఫిట్స్ రావడంతోనే అతను పంట పొలాల్లో పడి మృతి చెందాడని ఎస్సై స్పష్టం చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
