Advertisement

ప్రధాని మోదీని కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

మన పత్రిక: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో భాగంగా భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని ప్రధానిని చంద్రబాబు ఆహ్వానించారు.

ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు

ఆగస్టు 1న జరగనున్న భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించేందుకు నలుగురు ఐఏఎస్ అధికారులను ప్రత్యేకంగా నియమించారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisement
Advertisement