మన పత్రిక, హైదరాబాద్: నీట్ పేపర్ లీక్ మరియు రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ లోక్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. మరోవైపు, ప్రధాని మోడీ నివాసం వద్ద నిరసన తెలిపారంటూ కాంగ్రెస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ కార్యకర్తలు గాంధీ భవన్ ముట్టడికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో రెండు పార్టీల కార్యకర్తలు నగరంలో ఆందోళనలకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
బీజేపీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడికి ప్రయత్నించగా, అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు కర్రలతో దాడి చేశారు. ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కర్రలతో దాడులకు పాల్పడటమే కాకుండా పోలీస్ వాహనాలపైకి ఎక్కారు. ఈ ఘర్షణలను అదుపు చేసే క్రమంలో పోలీసులు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావులను అదుపులోకి తీసుకున్నారు. కార్యకర్తల మధ్య చెలరేగిన ఈ గొడవను నియంత్రించడం పోలీసులకు సవాల్‌గా మారింది.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
ఇవి కూడా చదవండి :
- భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు: నలుగురు ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు
- ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బైక్‌పైనే ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి ఆఫీసు పని చేసుకున్న ఉద్యోగి
- పాస్‌పోర్టు ఫీజు పెంపుపై కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
- తల్లికి వందనం పథకం ద్వారా పదివేల కోట్ల నిధుల విడుదల
- తమ్మినేని సీతారాం భూ భాగోతాలపై సమగ్ర విచారణకు ఆదేశించాం: అచ్చెన్నాయుడు
