Advertisement

నీట్ పరీక్ష రద్దయితే నిరాశపడొద్దు: టాపర్ పాన్షుల్ బన్సాల్

మన పత్రిక: నీట్ పరీక్ష రద్దు నేపథ్యంలో ఆందోళన చెందుతున్న విద్యార్థులకు ఆలిండియా ర్యాంక్ 2 టాపర్ పాన్షుల్ బన్సాల్ కీలక సందేశాన్ని అందించారు. పరీక్ష రద్దయినప్పుడు మొదట తాను కూడా తీవ్ర నిరాశకు గురయ్యానని, అయితే ఏడవడం వల్ల ప్రయోజనం లేదని గ్రహించి వెంటనే తేరుకున్నానని ఆయన తెలిపారు. ఈ కష్ట సమయంలో తన కుటుంబం తనకు అండగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.

పరీక్షల నిర్వహణ అనేది మన చేతుల్లో లేని అంశమని, కాబట్టి జరిగేదంతా మన మంచికే అని భావించాలని ఆయన విద్యార్థులకు సూచించారు. రీ-ఎగ్జామ్‌ను మరింత మెరుగైన స్కోరు సాధించేందుకు వచ్చిన ఒక అవకాశంగా పరిగణించి, మరింత దృష్టి సారించి ప్రిపరేషన్ కొనసాగించాలని చెప్పారు. పరీక్ష రద్దయిన సమయంలో ఓర్పు, సహనంతో ఉండటం చాలా ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
Advertisement