Advertisement

సూర్యాపేట జిల్లాలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన సిమెంట్ లారీ

మన పత్రిక, కోదాడ: సూర్యాపేట జిల్లాలోని చిలుకూరు మండలం సీతారాంపురం సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్యాలగూడ నుంచి కోదాడ వైపు ప్రయాణికులతో వెళ్తున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన సిమెంట్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు బస్సు అదుపుతప్పి రహదారి పక్కన కిందివైపు దూసుకెళ్లింది.

అయితే, బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Advertisement
Advertisement