Advertisement

పుప్పాలగూడలో వాటర్ ట్యాంకర్ బీభత్సం: యువకుడు మృతి

మన పత్రిక, గండిపేట: నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడ టోల్‌గేట్ సమీపంలో వాటర్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ బైక్‌ను ఢీకొనడంతో ఒక యువకుడు అక్కడికక్కడే మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ట్యాంకర్ అదుపు తప్పి మరో కారును, స్కూటీని కూడా ఢీకొట్టింది.

ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుశీల్ కుమార్(28) మరియు సురేష్ కాటేదాన్ పరిధిలోని లక్ష్మిగూడలో నివాసముంటూ వడ్రంగి పనులు చేస్తున్నారు. మంగళవారం రాత్రి హాఫీజ్‌పేట్‌లో పని ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన సురేష్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సుశీల్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి పంపారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ రంజిత్ సింహాపై నార్సింగి పోలీసులు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement