Advertisement

షాబాద్ హత్యల కేసు నిందితుడు రాజ్‌కుమార్ మృతి

మన పత్రిక, రంగారెడ్డి: దేశవ్యాప్తంగా కలకలం రేపిన షాబాద్ ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్‌కుమార్ మృతి చెందాడు. కొత్తూరు మండలం పంజర్ల గ్రామంలో అతని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఇది అతని మేనమామ స్వగ్రామమని తెలుస్తోంది. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు, మృతదేహం సమీపంలో విషం బాటిల్ లభించినట్లు వెల్లడించారు. ఈ ఆధారాల మేరకు నిందితుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నివేదిక కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం మరణానికి గల మరిన్ని కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఘటనకు సంబంధించి విచారణ కొనసాగుతోంది.

Advertisement
Advertisement