Advertisement

తెలంగాణలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నోటిఫికేషన్

మన పత్రిక, తెలంగాణ: సర్వీసులో ఉండి ఇప్పటివరకు టెట్ (TET) అర్హత సాధించని ఉపాధ్యాయుల కోసం ప్రభుత్వం ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ మేరకు జులై 21న అధికారిక ప్రకటన విడుదల కానున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను విద్యాశాఖ పూర్తి చేసింది. అర్హత లేని ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

నిర్ణీత షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 7, 8, 9 తేదీలలో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. పరీక్షా విధానం, సిలబస్ నిబంధనల పూర్తి వివరాలను నోటిఫికేషన్ వెలువడిన రోజున అధికారిక వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో ఏడాదికి నాలుగు సార్లు టెట్ పరీక్షలు నిర్వహించేలా కొత్త విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇన్ సర్వీస్ టీచర్లకు ఏడాదికి రెండుసార్లు అవకాశం కల్పిస్తారు.

Advertisement
Advertisement