Advertisement

ఢిల్లీలో దారుణం: పుట్టినరోజే భార్యను కాల్చి చంపిన కానిస్టేబుల్

మన పత్రిక, ఢిల్లీ: దేశ రాజధానిలో జరిగిన దారుణ ఘటనలో భార్య పుట్టినరోజు నాడే ఆమెను భర్త కాల్చి చంపాడు. ఢిల్లీ పోలీస్ (Delhi Police) విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మనీశ్ భాటి, సోమవారం తెల్లవారుజామున తన భార్య ప్రియాంకతో కలిసి కల్యాణ్‌పురి ప్రాంతంలో స్కూటర్‌పై వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దారిలో దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో, కానిస్టేబుల్ వాహనాన్ని నిలిపి తన వద్ద ఉన్న తుపాకీతో ప్రియాంకపై కాల్పులు జరిపాడు.

తీవ్రంగా గాయపడిన ప్రియాంకను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఘటన అనంతరం మనీశ్ భాటి అక్కడి నుంచి పరారయ్యాడని స్థానికులు తెలిపారు. బాధితురాలి పుట్టినరోజు రోజే ఈ ఘోరం జరగడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

Advertisement
Advertisement