Advertisement

మత్స్యకారుల మరణాలపై జగన్ దొంగ నాటకాలు ఆడుతున్నారు: మంత్రి కొల్లు రవీంద్ర

మన పత్రిక, విశాఖపట్నం: మత్స్యకారుల మరణాలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా విమర్శించారు. పరామర్శల పేరుతో జగన్ దొంగ నాటకాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. విశాఖపట్నం పడవ ప్రమాద బాధితులకు ప్రభుత్వం 72 గంటల్లోనే పది లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించిందని మంత్రి గుర్తు చేశారు.

గత వైసీపీ (YSRCP) హయాంలో 63 మత్స్యకార కుటుంబాలను పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం వేట నిషేధ భృతిని 20 వేల రూపాయలకు పెంచి అందిస్తోందని తెలిపారు. జువ్వలదిన్నెలో చిచ్చుపెట్టాలని చూస్తే ఊరుకోబోమని జగన్ మోహన్ రెడ్డిని మంత్రి హెచ్చరించారు. మత్స్యకార కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
Advertisement