Advertisement

జూబ్లీహిల్స్‌లో ఫెరారీ కారు బీభత్సం

మన పత్రిక, జూబ్లీహిల్స్: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 5లో ఆదివారం తెల్లవారుజామున ఫెరారీ కారు (Ferrari Car) ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ఈ కారు అపార్ట్‌మెంట్ ప్రధాన గేటును బలంగా ఢీకొట్టడంతో గేటు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన వెంటనే వాహనంలోని వ్యక్తులు కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. ఈ ఘటనపై ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రమాద సమయంలో కారులో ఉన్న వ్యక్తుల గుర్తింపు కోసం పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. మద్యం మత్తులో వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కారును స్టేషన్‌కు తరలించి, దాని రిజిస్ట్రేషన్ వివరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. గత వారం రోజుల్లోనే ఈ ప్రాంతంలో జరిగిన రెండో ప్రమాదం కావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement