మన పత్రిక హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మాంసం ప్రియులకు షాక్ ఇచ్చేలా చికెన్ షాపుల యజమానుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పౌల్ట్రీ కంపెనీల మొండివైఖరికి నిరసనగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి తెలంగాణవ్యాప్తంగా చికెన్ విక్రయాలు నిలిపివేయాలని (బంద్) నిశ్చయించింది. మార్కెట్లో ధరలు పెరుగుతున్నా, తమకు ఇచ్చే మార్జిన్‌ను పౌల్ట్రీ కంపెనీలు భారీగా తగ్గించడంపై వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కంటే కిలోకు రూ.20 వరకు మార్జిన్ తగ్గించారని, ఈ పరిస్థితుల్లో వ్యాపారం చేయడం భారంగా మారిందని ఆవేదన చెందుతున్నారు.
రికార్డు స్థాయిలో ధరలు ప్రస్తుతం మార్కెట్లో కిలో చికెన్ ధర రూ.360 నుంచి రూ.380 వరకు పలుకుతోంది. వారం రోజుల వ్యవధిలోనే ధరలు అమాంతం పెరగడం గమనార్హం. ఎండల తీవ్రతకు బ్రాయిలర్ కోళ్లు మృత్యువాత పడటం, దాణా ఖర్చులు పెరగడం వల్ల సరఫరా గణనీయంగా తగ్గింది. కోళ్లను కాపాడుకోవడానికి కూలర్లు, స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయడం ఫామ్ నిర్వాహకులకు అదనపు భారం కావడంతో చాలామంది పెంపకాన్ని నిలిపివేశారు. దీనివల్ల ఏపీ, మహారాష్ట్రల నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని, త్వరలోనే కిలో ధర రూ.400 దాటే అవకాశం ఉందని వ్యాపారులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని పౌల్ట్రీ కంపెనీలతో మాట్లాడి తమ మార్జిన్ పెంచకపోతే నిరవధిక సమ్మెకు వెళ్తామని అసోసియేషన్ స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి :
- HYD: 29, 30వ తేదీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక క్రీడా పోటీలు
- ఆరోగ్యశ్రీ బకాయిలు గత ప్రభుత్వ పాపమే: ముఖ్యమంత్రి
- రాష్ట్రాలకు కేంద్రం లేఖ.. అగ్నివీర్లకు ఉద్యోగాల్లో 20 శాతం రిజర్వేషన్
- TG: తెలంగాణలో పెట్రోల్ టెన్షన్: బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు
- కాంగ్రెస్‌పై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఫైర్.. పథకాలకు ఇందిరమ్మ పేరెందుకు?
