మన పత్రిక, ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత కోసం మదన్ మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘మెగా జాబ్ మేళా – 2026’ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఉద్యోగ మేళా ఈనెల 24వ తేదీన ఎల్లారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది.
ఈ మేళాలో 70కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని, 5,000కు పైగా ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నాయని ట్రస్ట్ ప్రతినిధులు వెల్లడించారు. దీనిద్వారా సుమారు 5,000 మంది నిరుద్యోగ యువతకు ప్రత్యక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. బ్యాంకింగ్, హెల్త్‌కేర్, ఐటీ & బీపీవో, సేల్స్ అండ్ మార్కెటింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ సహా పలు ప్రైవేట్ రంగాల్లో ఈ అవకాశాలు ఉన్నాయి.
10వ తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్హత కలిగిన ఫ్రెషర్లతో పాటు అనుభవం ఉన్నవారు కూడా ఈ మేళాకు హాజరుకావచ్చని సూచించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు క్యూఆర్ కోడ్ ద్వారా లేదా నిబంధనల ప్రకారం సంబంధిత వెబ్‌సైట్‌లో ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
