Advertisement

జీ5 తెలుగులో సెప్టెంబర్ 25 నుంచి అగాధ స్ట్రీమింగ్

మన పత్రిక: ప్రముఖ దర్శకుడు ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రం ‘అగాధ’ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై విడుదలకు సిద్ధమైంది. ఈ తెలుగు చిత్రం సెప్టెంబర్ 25 నుంచి జీ5 తెలుగు (ZEE5 Telugu) ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ద్వారా మరింత మంది ప్రేక్షకులకు చేరువ కానుంది.

ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్ర పోషించారు. ఆధ్యాత్మిక శక్తులు కలిగిన మహాదేవి అనే మహిళగా ఆమె నటించారు. శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవిక విజయ్ కుమార్, రోషన్ బషీర్, భాను చందర్, వనితా విజయ్‌కుమార్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

Advertisement

మహాదేవి బంధువు ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వరుసగా జరిగే అనుమానాస్పద మరణాల వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి మహాదేవి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆమె ఒక నిషేధిత అటవీ గుహలోకి వెళుతుంది. అక్కడ ఆమెకు ‘అగాధ’ అనే వివరించలేని అదృశ్య శక్తి ఎదురవుతుంది. నమ్మకం, ఆధ్యాత్మికత, పురాణాలు, భయం వంటి అంశాల చుట్టూ ఈ కథ సాగుతుంది.

శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బాలుసు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి నాని చమిడిశెట్టి ఛాయాగ్రహణం అందించగా, రాకేష్ వెంకటాపురం సంగీతం కూర్చారు. జునైద్ సిద్ధిఖీ ఎడిటర్‌గా వ్యవహరించారు.

Advertisement