మన పత్రిక, ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా Yellandu పట్టణంలోని ఒక మార్ట్‌లో ఉపాధ్యాయుడు దొంగతనానికి పాల్పడిన ఘటన స్థానికంగా వెలుగుచూసింది. మద్యం మత్తులో మార్ట్‌కు వచ్చిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు, కొన్ని వస్తువులకు బిల్లు చెల్లించకుండా తన జేబులో వేసుకొని బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ దృశ్యాలు మార్ట్‌లోని సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి.
ఉపాధ్యాయుడి చర్యలను సీసీటీవీలో గమనించిన సిబ్బంది వెంటనే ఆయనను నిలదీశారు. మొదట తన తప్పును అంగీకరించకపోయినా, దృశ్యాలను చూపించడంతో ఆయన వెనక్కి తగ్గారు. ఆ తర్వాత మరొక ప్రభుత్వ ఉపాధ్యాయుడు వచ్చి మార్ట్ యాజమాన్యంతో మాట్లాడి రాజీ కుదిర్చారని, దీంతో ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లకుండా ముగిసిందని సమాచారం. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులు ఇలా ప్రవర్తించడంపై స్థానికులు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
- రామారెడ్డి మండలంలో వ్యక్తి అనుమానాస్పద మృతి
- మహేష్ బాబు, రాజమౌళి సినిమా టైటిల్ వివాదానికి తెరపడింది
- ఢిల్లీలో మెట్రో స్టేషన్ల మూసివేతపై స్పందించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
- ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదాలు: వేర్వేరు ఘటనల్లో ఎనిమిది మంది మృతి
- హనీమూన్ హత్య కేసులో సోనమ్ రఘువంశీ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు
