Advertisement

నాని ‘ది ప్యారడైజ్’ చిత్రానికి ‘A’ సర్టిఫికేట్

మన పత్రిక: నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి ‘A’ సర్టిఫికేట్ మంజూరు చేసింది. ఈ విషయాన్ని నాని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ సర్టిఫికేషన్ ప్రకటనపై నాని స్పందిస్తూ, నిబంధనల ప్రకారం ‘A’ సర్టిఫికేట్ వచ్చినప్పటికీ, చిత్రంలోని కంటెంట్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉందనే ఉద్దేశంతో పోస్ట్ చేశారు. శ్రీకాంత్ ఒడెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాఘవ్ జుయల్, మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, కాయదు లోహర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

ఈ చిత్రానికి సంబంధించి నైజాం ప్రాంతంలో అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా త్వరలోనే టికెట్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

Advertisement