టాలీవుడ్ లో ఈ మధ్య చిన్న సినిమాల్లో ఎక్కువ హైప్ ని సొంతం చేసుకున్న సినిమా “ఫంకీ” (Funky). జాతిరత్నాలు, ప్రిన్స్ సినిమాల డైరెక్టర్ అనుదీప్(Anudeep) ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండడంతో అంచనాలు ముందు నుండే క్రేజీగా ఉన్నాయి. దీనికితోడు ఫంకీ టీజర్ కూడా ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Viswak sen) హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. అందువల్ల డిఫరెంట్ గా ఏదైనా ఉంటుందని కొందరు అనుకున్నా, టీజర్ చూడగానే ఇది పక్కా అనుదీప్ స్టయిల్లోనే ఎంటర్టైన్మెంట్ జోన్ లో రానుందని క్లారిటీ వచ్చేసింది.
ఇదిలా ఉండగా ఫంకీ నుండి తాజాగా మరో అప్డేట్ వచ్చింది. ఫంకీ కి సంబంధించి ఇప్పటికే షూటింగ్ మొత్తం అయిపోయి, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయిపోగా, తాజాగా డబ్బింగ్ వర్క్ కూడా ఫినిష్ చేసినట్టు, విశ్వక్ సీన్ కి సంబంధించిన వీడియోతో మేకర్స్ అనౌన్స్ చేసారు. ఇక ఈ సినిమాతో విశ్వక్ సేన్ పక్కా సాలిడ్ కం బ్యాక్ ఇస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గ్యాంగ్స్ అఫ్ గోదావరి లాంటి సినిమాలు కూడా ఆడియన్స్ ని అంతగా మెప్పించలేని నేపథ్యంలో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ తో వస్తున్న విశ్వక్ సేన్ ఫంకీ తో రఫ్ఫాడించడం ఖాయమని కామెంట్స్ వస్తున్నాయి.
ఇక ఫంకీ లో “కయాదు లోహర్” (Kayadu lohar) హీరోయిన్గా నటిస్తోంది. కాగా భీమ్స్ సిసిరోలియో (Bheems ciciroleo) సంగీతం అందిస్తున్న ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ (Sitara Entertainments) బ్యానర్ పై నాగవంశీ (Nagavamsi) నిర్మిస్తున్నాడు. ఇక ఫంకీ సినిమాను ఫిబ్రవరి 13న వాలైంటైన్స్ డే స్పెషల్ గా రిలీజ్ చేయనున్నారు మేకర్స్.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
