Advertisement

ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు ‘వెంకట్రామయ్య గారి తాలూకా’

మన పత్రిక: జానపద గాయని కోమలి నిర్మాతగా వ్యవహరిస్తూ నిర్మించిన భావోద్వేగ కుటుంబ కథా చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’. ఈ సినిమా ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో దినేష్ కుమార్ కథానాయకుడిగా నటిస్తుండగా, ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ కథానాయికగా పరిచయం కానున్నారు.

సినిమా విశేషాలు

సతీష్ ఆవాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి ఆయనే కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు. కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Advertisement

నిర్మాత వ్యాఖ్యలు

తన నిజ జీవిత అనుభవాల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు నిర్మాత కోమలి మహేందర్ తొట్టె తెలిపారు. ఇది ఒక ఆడబిడ్డ కన్నీటి కథ అని, ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఈ చిత్రాన్ని పూర్తి చేశామని ఆమె పేర్కొన్నారు. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులను కంటతడి పెట్టించేలా ఈ కథ ఉంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement