Advertisement

రా ఎన్టీఆర్ సంస్థతో ఎన్టీఆర్‌కు ఎటువంటి సంబంధం లేదు

మన పత్రిక: రా ఎన్టీఆర్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ సంస్థతో తమకు ఎటువంటి సంబంధం లేదని నటుడు ఎన్టీఆర్ ప్రతినిధి బృందం స్పష్టం చేసింది. ఈ మేరకు వారు ఒక అధికారిక ప్రకటనను విడుదల చేశారు.

ఎన్టీఆర్‌కు లేదా ఆయన కార్యాలయానికి సదరు రా ఎన్టీఆర్ సంస్థతో ఎలాంటి అనుబంధం, అనుమతి లేదా ప్రమేయం లేదని ప్రతినిధులు తెలిపారు. ఎన్టీఆర్ తరఫున ప్రాతినిధ్యం వహించే హక్కు ఆ సంస్థకు లేదని, ఆయన పేరుతో ప్రకటనలు చేసే అధికారం వారికి లేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌కు సంబంధించిన ఏవైనా సేవా కార్యక్రమాలు లేదా అధికారిక ప్రకటనలను కేవలం ఆయన బృందం ద్వారా మాత్రమే విడుదల చేస్తామని వారు పేర్కొన్నారు.

Advertisement

అనధికారిక ప్రచారాలను నమ్మవద్దు

అనధికారిక వ్యక్తులు లేదా సంస్థల ద్వారా వచ్చే సమాచారాన్ని విశ్వసనీయమైనవిగా పరిగణించవద్దని ప్రతినిధులు అభిమానులకు విజ్ఞప్తి చేశారు. మీడియా సంస్థలు, సోషల్ మీడియా వేదికలు మరియు శ్రేయోభిలాషులు ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయవద్దని, కేవలం అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్నే పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరారు.

Advertisement