Advertisement

త్రిపురాంతకంలో విషాదం: చెరువులో మునిగి 15 ఏళ్ల బాలుడు మృతి

మన పత్రిక, త్రిపురాంతకం: ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గొల్లపల్లి గ్రామంలో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉప్పలపాటి తిరుమలబాబు (15) అనే బాలుడు తన స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు లోతైన ప్రాంతంలోకి వెళ్లడంతో బాలుడు నీటిలో మునిగిపోయాడు.

తోటి స్నేహితుల కేకలతో స్థానికులు మరియు ఈతగాళ్లు వెంటనే స్పందించి గాలింపు చర్యలు చేపట్టారు. గాలించిన అనంతరం తిరుమలబాబును బయటకు తీసినా అప్పటికే అతను మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement
Advertisement