Advertisement

ఖైరతాబాద్‌లో 24 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్ నగరంలో వినాయకచవితి సందడి మొదలైంది. గణేష్ ఆగామన్‌ ఉత్సవాలతో కోలాహలంగా మారిన భాగ్యనగరంలో అసలైన పండుగ శోభ సంతరించుకోనుంది. ఇక ఖైరతాబాద్ బడా గణేషుడి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో సెప్టెంబర్ 12వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. భక్తుల రద్దీని బట్టి ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు వాహనాల మళ్లింపు ఉంటుందని స్పష్టం చేశారు.

ట్రాఫిక్ మళ్లింపులు:

Advertisement
  • సైఫాబాద్ ఓల్డ్ పీఎస్ నుంచి బడా గణేష్ వైపు వచ్చే వాహనాలను ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు.
  • ఇక్బాల్ మినార్ నుంచి ఐమ్యాక్స్ వైపు వెళ్లే వెహికల్స్‌ను సెక్రటేరియట్ క్రాస్ రోడ్డు వైపు పంపుతారు.
  • నెక్లెస్ రోటరీ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వెళ్లే వాహనాలను సెక్రటేరియట్ జంక్షన్, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ వైపునకు మళ్లించనున్నారు.
  • నిరంకారి నుంచి ఖైరతాబాద్ రైల్వే గేట్ వైపు వెళ్లే వాహనాలను పీఎస్ సైఫాబాద్ జంక్షన్ వైపు పంపుతారు.

పార్కింగ్ ప్రాంతాలు: భక్తుల వాహనాల కోసం రేస్ కోర్స్ రోడ్, ఎన్టీఆర్ ఘాట్, HMDA పార్కింగ్ స్థలం, ఐమ్యాక్స్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పార్కింగ్‌ వసతి కల్పించారు. ఏవైనా అత్యవసర ట్రాఫిక్ సాయం కోసం 9010203626 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు.

Advertisement