మన పత్రిక, హైదరాబాద్: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం (మార్చి 30, 2026) రోజున చంద్రుడు సింహ రాశిలో సంచారం చేయనున్నాడు. ద్వాదశ రాశులపై మాఘ నక్షత్ర ప్రభావం ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు శూల, గండ యోగాలు ఏర్పడనున్నాయి. ప్రముఖ పండితులు ఆచార్య క్రిష్ణ దత్త శర్మ అంచనా ప్రకారం నేటి 12 రాశుల ఫలాలు (Today Horoscope) ఎలా ఉన్నాయంటే..
- మేష రాశి: చంద్రుడి అనుగ్రహంతో ఆదాయం పెరుగుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. పిల్లల ద్వారా శుభవార్తలు వింటారు. సాయంత్రానికి పెండింగ్ పనులు పూర్తవుతాయి.
- వృషభ రాశి: సానుకూల ఫలితాలు వస్తాయి. రాజకీయ నాయకులకు, ప్రభుత్వ కాంట్రాక్టులు చేసేవారికి లాభదాయకం. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రాత్రి పూట అనవసర పరిచయాలు, సమస్యలకు దూరంగా ఉండాలి.
- మిథున రాశి: ప్రతికూల ఫలితాలు ఉండొచ్చు, విలువైన వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉంది. పిల్లలు చదువులో రాణిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు, కానీ అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్త.
- కర్కాటక రాశి: ఆదాయం పెరుగుతుంది, కెరీర్‌లో పురోగతి లభిస్తుంది. సమాజంలో గౌరవం ఇనుమడిస్తుంది. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. సాయంత్రం ప్రియమైన వారి ద్వారా శుభవార్తలు వింటారు.
- సింహ రాశి: కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అయితే సూర్యుడి ప్రభావంతో చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రావొచ్చు.
- కన్య రాశి: ధైర్యం పెరుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు, వ్యాపారులకు విశేష లాభాలు ఉన్నాయి. కోర్టు కేసుల్లో సానుకూల తీర్పు వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
- తులా రాశి: కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు. వ్యాపారులు లాభాల కోసం మరింత కష్టపడాల్సి ఉంటుంది.
- వృశ్చిక రాశి: శని, కుజుడి ప్రభావంతో ప్రతికూలతలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు, కుటుంబంలో గొడవలు రావొచ్చు. వ్యాపారులు నష్టపోకుండా జాగ్రత్తపడాలి. విదేశీ ప్రయాణ యోగం ఉంది.
- ధనుస్సు రాశి: ప్రత్యర్థుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటారు. రాజకీయ నాయకులకు ప్రజాదరణ, బంధువుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
- మకర రాశి: కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. కొత్త ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆఫీసులో సహకారం లభిస్తుంది. సాయంత్రం ఎలాంటి వివాదాల్లో తలదూర్చవద్దు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
- కుంభ రాశి: మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. శని ప్రభావంతో ప్రత్యర్థుల వల్ల ఇబ్బందులు ఎదురుకావచ్చు. వివాదాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.
- మీన రాశి: శని, సూర్యుడి అనుగ్రహంతో సానుకూల ఫలితాలు వస్తాయి. వైవాహిక సమస్యలు తీరిపోతాయి. దానధర్మాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. విలువైన వస్తువుల పట్ల, ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం.
(గమనిక: ఈ జ్యోతిష్య సమాచారం నమ్మకాలు, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు.)
Advertisement
ఇవి కూడా చదవండి :
Advertisement
