Advertisement

తిరుపతి: రాత్రి రోడ్డు రక్షణ గోడపై చిరుత

తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం పరిధిలోని చిట్వేలి-రాపూరు ఘాట్‌ రోడ్డులో చిరుత సంచారం తీవ్ర కలకలం సృష్టించింది. మంగళవారం రాత్రి ఘాట్‌ రోడ్డులోని రక్షణ గోడపై చిరుత కూర్చొని ఉండటాన్ని గమనించిన కారు ప్రయాణికులు ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి.

గతంలోనూ ఈ రహదారిలో పలుమార్లు చిరుతలు కనిపించాయి. ఘటనపై చిట్వేలి ఎఫ్‌ఆర్‌ఓ ధీరజ్‌కుమార్‌ స్పందిస్తూ.. అటవీ ప్రాంత పరిధిలో దాదాపు 20 చిరుతలు, ఒక పెద్దపులి సంచరిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా సాయంత్రం 5 గంటల తర్వాత ఈ ఘాట్‌ రోడ్డులో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధించినట్లు వెల్లడించారు. చీకటి పడిన తర్వాత ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement