మన పత్రిక: వైసీపీ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భూ భాగోతాలపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, స్పీకర్గా ఉన్నప్పుడు నీతులు చెప్పిన తమ్మినేని ఇలాంటి దారుణాలకు ఒడిగట్టడం దారుణమని ఆయన విమర్శించారు. బతికి ఉన్న వ్యక్తిని చనిపోయినట్లు చిత్రీకరించి సాక్ష్యాలు తారుమారు చేసేందుకు ప్రయత్నించారని అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయ కక్షసాధింపులు తమ సంస్కృతి కాదని, తప్పు చేసిన ఎవరినైనా కూటమి ప్రభుత్వం చట్టప్రకారం శిక్షించి తీరుతుందని మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు, గతంలో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిన జగన్, ఇప్పుడు ఉత్తుత్తి సమావేశాలు నిర్వహిస్తున్నారని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, దీనిని చూసి ఓర్వలేక జగన్ సరికొత్త రాజకీయ నాటకాలకు తెరలేపారని ఆయన విమర్శించారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
